Abdullapurmet: రోడ్డు పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన!

Abdullapurmet: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని 143 రోడ్ల అభివృద్ధికి రూ. 338 కోట్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కూటమి ఎంపీలు శంకుస్థాపన చేశారు.

AJAY, HAYATH NAGAR
Published on: 7 July 2026 4:20 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: రోడ్డు పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన!

Abdullapurmet: మరోసారి అవకాశం ఇస్తే.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 143 రోడ్ల అభివృద్ధి కోసం శంకుస్థాపన కార్యక్రమం మంగళవారం తొర్రూర్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఆర్ అండ్ బి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు 25 నెలలో ఉందన్నారు. మరోసారి ఆకాశం ఇస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞం ద్వారా కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజలతో చాలా అనుబంధాలు ఉన్నాయని అన్నారు.

ఆ అనుబంధం తోనే ఈ నియోజకవర్గాన్ని రూ. 338 కోట్ల తో అభివృద్ధి కోసం వీధులు కేటాయించినట్లు తెలిపారు. మరో రూ. 110 కోట్ల తో మండల పరిధి పెద్ద అంబర్ పేట్ నుంచి అనాజ్ పూర్, అనాజ్ పూర్ నుంచి గువ్వలేటి వరకు నాలుగు లైన్ల రోడ్ల కోసం విధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

ఇబ్రహీంపట్నం వాళ్ళు ఎప్పుడు వచ్చినా తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటూ మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఆర్ అండ్ బి కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, బా టసింగారం సహకార సంఘం అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయక్ సీనియర్ నాయకులు కొత్త కురుమ శివకుమార్, పెద్ద అంబర్ పేట్ డివిజన్ అధ్యక్షులు పండుగల రాజు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story