Miyapur: మియాపూర్‌లో దక్షిణ భారత తొలి 'అహింసా స్తూపం' ఆవిష్కరణ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Miyapur: మియాపూర్‌లోని వైశాలి నగర్‌లో దక్షిణ భారతదేశపు మొట్టమొదటి 'అహింసా స్తూపం'ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.
Miyapur: మియాపూర్‌లో దక్షిణ భారత తొలి 'అహింసా స్తూపం' ఆవిష్కరణ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Miyapur: మియాపూర్‌లోని వైశాలి నగర్‌లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి 'అహింసా స్తూపం ' ఆవిష్కరణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. జైన్ మహిళా పరిషద్ ఆధ్వర్యంలో మంజీర పైప్‌లైన్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఈ అహింసా స్తంభాన్ని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ... భగవాన్ మహావీరుని 'అహింసా పరమో ధర్మః', 'జీవించు - జీవించనివ్వు' అనే విశ్వశాంతి సందేశాలను సమాజానికి చాటిచెప్పే దివ్య ప్రతీకగా ఈ అహింసా స్తంభం నిలుస్తుందని పేర్కొన్నారు.
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అహింసా స్తంభం మన భాగ్యనగరంలో కొలువుదీరడం అందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ మహోత్సవంలో జైన సమాజ ప్రతినిధులు, నిర్వాహకులు, ట్రస్టీలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




