Bachupally: బాచుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Bachupally: బాచుపల్లి సోషల్ వెల్ఫేర్ బాలికల కళాశాల వద్ద డంపింగ్ యార్డ్ సమస్యపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్.
Bachupally: బాచుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Bachupally: బాచుపల్లి పరిధిలోని సాయినగర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ డిగ్రీ కళాశాలను, పక్కన డంపింగ్ యార్డును మంగళవారం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కిట సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సందర్శించి పరిశీలించారు. కళాశాల సమీపంలోలి ఏర్పడిన దంపింగ్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలు, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ సమస్తును తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టేట్, మైనారిటీ, బీసీ, సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఆయన సంబంధిత స్థలాన్ని సందర్శించి, పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజారోగ్యం, పరిసరాల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డ్ను పూర్తిగా శుభ్రపరిది, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా స్థానికులకు హామీ ఇచ్చారు.
ఈ పర్యటన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ు మర్యాదపూర్వకంగా కలసి కాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇద్దరూ కలిసి డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థితులు, దుర్గంధం, దోమల సమస్యతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య
ఇబ్బందులపై చర్చించారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థిసులు, పరిసర కాలనీల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అది త్వరలోనే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని హన్మంత్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్యాణ్'ని జిల్లా కలెక్టర్ మసుచౌదరి, ఆర్డీవో శ్యాంప్రకాష్, బాచుపల్లి ఎంఆర్ వాణిరెడ్డి, ఆరఐ మల్లేశ్వర్రావు, నిజాంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సావేర్ అలీ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, కొలన్ రాజశేఖర్ రెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలను సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారనేలి సందేశాన్ని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసింది.




