Hyderabad: దివ్యాంగులకు బిఆర్ఎస్ హయాంలోనే తీవ్ర అన్యాయం!
Hyderabad: హరీష్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. బిఆర్ఎస్ హయాంలో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ధ్వజం.
Hyderabad: దివ్యాంగులకు బిఆర్ఎస్ హయాంలోనే తీవ్ర అన్యాయం!
Hyderabad: మాజీ మంత్రి హరీష్ రావు దివ్యాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ చేసిన కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్న. వాళ్లు 2014, 2018 మేనిపెస్టోలో దివ్యాంగులకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదు. పదేళ్లు వికలాంగుల హామీలను గాలికి వదిలేశారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు. వారి సంక్షేమాన్ని కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. 2023 మేనిపెస్టో లో దివ్యాంగుల అంశాన్ని మేనిపెస్టోలో కూడా చేర్చలేదు. దివ్యాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం అన్నారు ఇచ్చారా..? ఏ ఒక్కటి అమలుకాలేదు. మీ హయాంలో ఏం చేశారో చెప్పడానికి ఏం లేక.. మాపై విమర్శలు చేస్తున్నారు. మేము వచ్చాక దివ్యాంగులకు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాహనాలు ఇచ్చాం.
పుట్టుకతో అంగ వైకల్యంతో ఉన్న వారికి బాల్ భరోసా తో ఆదుకుంటున్నాం. వికలాంగులకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం. మేము ప్రజలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీలను నెరవేరుస్తున్నాం. 2014, 2018, 2023 మ్యానిఫెస్టోలో బీఆర్ఎస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.
పదేళ్ల పాటు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు ఎదురులేదన్నట్లుగా వ్యవహరించారు. దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి హరీశ్ రావు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకుని ఏకవచనంతో సంబోధిస్తూ విమర్శలు చేస్తున్నారు.
దివ్యాంగులను బలవంతంగా సమావేశానికి పిలిపించుకుని విమర్శలు చేయించారు. హరీశ్ రావు విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దివ్యాంగులకు రూ.50 కోట్లతో వాహనాలు, బ్యాటరీ వెహికిల్స్‌తో పాటు ఇతర పరికరాలు అందించాం. వచ్చే ఏడాదిలో మరో రూ.50 కోట్లతో వాహనాలను అందిస్తాం. దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాం.
కొత్తగా దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేస్తున్నాం. పూర్తి అంగవైకల్యంతో జన్మించే వాళ్లకు బాల్ భరోసా పథకం ద్వారా ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి వైద్యం అందిస్తోంది. ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం.
వికలాంగుల ఆరు వేల పింఛన్లకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్థిక సమస్యల కారణంగా పింఛన్ల పెంపు ఆలస్యం అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వికలాంగుల సంక్షేమానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం.
2018, 2014 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టి అమలు చేయని వాటికి కేసీఆర్ సమాధానం చెప్పాలి. నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి చెల్లిస్తామని బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చి పక్కన పెట్టింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారు. ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు.
కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసం చేశారు. కొత్త యూనివర్సిటీలు నిర్మిస్తామని చెప్పారు. కనీసం ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేదు. తన పార్టీ నాయకుల ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చాడు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారు.
చట్టసభల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వంచించాడు. బీఆర్ఎస్ పార్టీ 2014, 2028 మ్యానిఫెస్టోలో చెప్పి అమలు చేయని అంశాలు చాలా ఉన్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించలేదు.
ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మా ప్రభుత్వం ఇచ్చింది. గుండె మీద చేయి వేసుకుని కేటీఆర్, హరీశ్ రావు దీనిపై సమాధానం చెప్పాలి. రేషన్ కార్డులు ఇచ్చాం.. సన్న బియ్యం ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఇప్పటికే అనేక చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
1000 రోజుల వైఫల్యాలపై పోరాటం చేస్తామని కేటీఆర్ అంటున్నాడు. మా పాలనపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి వచ్చి చర్చించాలి. పదేళ్లలో దివ్యాంగుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ఏనాడు ఆలోచన చేయలేదు. ప్రభుత్వం పోయాక దివ్యాంగులు బీఆర్ఎస్ పార్టీకి గుర్తుకు వచ్చారు.




