Charlapally: చక్రిపురంలో ఘనంగా ‘మీట్ ద సైంటిస్ట్’ కార్యక్రమం

Charlapally: చర్లపల్లి చక్రిపురంలోని శ్రీ చక్రి విద్యానికేతన్ హైస్కూల్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం నిర్వహించారు.

ASHOK, KAPRA
Published on: 27 April 2026 5:44 PM IST
Charlapally
X

Charlapally: చక్రిపురంలో ఘనంగా ‘మీట్ ద సైంటిస్ట్’ కార్యక్రమం

Charlapally: చర్లపల్లి డివిజన్ లో చక్రిపురంలో ని శ్రీ చక్రి విద్యానికేతన్ హైస్కూల్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం ఆరవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘మీట్ ద సైంటిస్ట్’ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త కర్రె మల్లేశం గారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లేశం గారు మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలలో శాస్త్రవేత్తల పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. కేవలం కొత్త విషయాలను కనుగొనడమే కాకుండా, ఆ ఆవిష్కరణలు సమస్త మానవాళికి ఉపయోగకరంగా ఉండి, వారి జీవన ప్రమాణాల అభివృద్ధికి తోడ్పడినప్పుడే ప్రతి శాస్త్రవేత్త నిజమైన సంతోషాన్ని పొందుతారని ఆయన ఆకాంక్షించారు.

విద్యార్థులు చిన్నతనం నుంచే పరిశీలనా శక్తిని పెంపొందించుకోవాలని, సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపే దిశగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానాలిచ్చారు. సైన్స్ పట్ల ఉన్న అపోహలను తొలగిస్తూ, పరిశోధనల పట్ల విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి పిట్టల నాగరాజు సీనియర్ నాయకులు శేషగిరిరావు, మూర్తి విద్యార్థులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story