Medipally: మేడిపల్లి పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

Medipally: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు.

KARUNAKAR, UPPAL
Published on: 12 Aug 2026 5:49 PM IST
Medipally
X

Medipally: మేడిపల్లి పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

మేడిపల్లి: బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసును విచారించిన నేరేడ్‌మెట్‌లోని అత్యాచారం, పోక్సో కేసుల ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. బోడుప్పల్‌ బొల్లిగూడెంకు చెందిన కాలా జాన్‌ (45)పై 2025లో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్‌ 279/2025 కింద బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 64(2)(ఎం), 351(2)తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 5(ఐ) రెడ్‌విత్‌ 6 కింద కేసు నమోదైంది. కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. అలాగే బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. ఈ కేసును అప్పటి మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌. గోవిందరెడ్డి దర్యాప్తు చేశారు.

స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి. శ్రీనివాస చారి ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు, విచారణ ప్రక్రియలో మేడిపల్లి పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మేడిపల్లి పోలీసులు తెలిపారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story