Medchal: మేడ్చల్‌లో విజయవంతమైన విద్యాసంస్థల బంద్

Medchal: ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌ను నిరసిస్తూ మేడ్చల్‌లో USFI ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్. కేజీ టూ పీజీ విద్యాసంస్థలు బంద్.

NAKSHATRAM, MEDCHAL
Published on: 24 July 2026 8:03 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్‌లో విజయవంతమైన విద్యాసంస్థల బంద్

మేడ్చల్: యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ నియోజకవర్గ కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్. ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యాసంవత్సరాలన్నింటిని బందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ నియోజకవర్గం కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.........* ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్య, ఉపాధి హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం తీవ్రంగా ఖండిస్తున్నాము.

విద్యారంగ ప్రైవేటీకరణ, ఫీజుల పెంపు, ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాల భర్తీ, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యు ఎస్ ఎఫ్ ఐఆధ్వర్యంలో దేశ రాజధానిలో వేలాది మంది విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, మహిళా విద్యార్థినులపై కూడా పోలీసులు దాడి చేయడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం. ఈ దాడిని నిరసిస్తూ యు ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను బంద్ చేస్తున్నాము.

మా డిమాండ్లు:

1. నిరసన చేస్తున్న విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి

2. లాఠీచార్జ్ కు ఆదేశించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

3. విద్య, ఉపాధి సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి

4. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలి

యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ర మేడ్చల్ లోని అన్ని కళాశాలలు, పాఠశాలల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించి, బంద్ ను విజయవంతం చేస్తాము అని అన్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story