Medchal: రూ. 2.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత – ఒక్కరు అరెస్ట్
Medchal: మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి వద్ద స్టేట్ టాస్క్ ఫోర్స్ చేపట్టిన దాడుల్లో రూ.2.50 లక్షల విలువైన 5 కిలోల గంజాయితో ఒక్కడిని అరెస్ట్ చేశారు.
Medchal: రూ. 2.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత – ఒక్కరు అరెస్ట్
మేడ్చల్: బుధవారం తెల్లవారు జామున స్టేట్ టాస్క్ ఫోర్స్ A, B టీమ్స్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు ఫయాజ్, విష్ణుమూర్తి ఆదేశాల మేరకు, టాస్క్ఫోర్స్ సిఐలు ఎం.పి.ఆర్ చంద్రశేఖర్, బిక్షారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి శివారులో మలీబు రెస్టారెంట్ ఎదురుగా నాగపూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చె ట్లావెల్ బస్సుల్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు బస్సులలో వచ్చె పాసెంజర్ లను తనిఖీలు నిర్వహించారు.
ఈ దాడిలో మొహమ్మద్ ఖాదర్, 46 ఇస్లాంపూర్, ఇచ్చోడ, ఆదిలాబాద్ అనే వ్యక్తి వద్ద 5 కిలోల ఎండు గంజాయి ఐదు పాకెట్లలో పాక్ చేసి హాండ్ బ్యాగ్ లో ఉండగా స్వాధీన స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి నిందితుడు అరెస్ట్ చేసి విచారించగా, తను గోల్కొండ కు చెందిన మొహమ్మద్ కు సరఫరాచేసి ఇద్దరం కలిసి విక్రయిస్తామని తెలిపినాడు. నాగపూర్ లో రెండువేలకు కిలోచొప్పున ఒరిస్సా రాష్ట్రానికీ చెందిన అపరిచిత వ్యక్తుల వద్ద కొనుగోలుచేసి హైదరాబాద్ లో 50 గ్రాముల పాకెట్ ను 500 రూపాయలకు విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ విచారణలో మొహమ్మద్ ఖాదర్ తెలిపినాడు.
స్వాదీనపరుచున్న ఐదు కిలోల గంజాయిని, మొహమ్మద్ ఖాదర్ ను ఎక్సైజ్ స్టేషన్ మేడ్చల్ నందున అప్పచెప్పడం జరిగింది. ఈ దాడుల్లో సిఐలు ఎం.పి.ఆర్ చంద్రశేఖర్ , బిక్షారెడ్డి లతో పాటు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్సైలు బాల్ రాజ్, సాయికిరణ్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.




