Medchal: మేడ్చల్‌లో విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగులు, పుస్తకాల పంపిణీ

Medchal: మేడ్చల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత రాఘవేంద్ర గౌడ్.

NAKSHATRAM, MEDCHAL
Published on: 27 July 2026 7:36 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్‌లో విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగులు, పుస్తకాల పంపిణీ

మేడ్చల్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ పట్టణం 297 డివిజన్ లో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు,నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్ఆర్ ఫౌండేషన్ (RR Foundation) అధినేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వహస్తాలతో ఈ విద్యా సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ... పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో, వారికి తమ వంతు సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రాఘవేంద్ర గౌడ్ చేసిన ఈ ఉదార సహాయాన్ని అభినందించారు. ప్రైవేట్ పాఠశాలలకు తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూల్ పిల్లలకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేయడం ద్వారా వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story