Hyderabad: మేడ్చల్ మల్కాజిగిరి సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్
Hyderabad: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సీనియర్ జడ్జి ప్రియాంక తెలిపారు.
Hyderabad: మేడ్చల్ మల్కాజిగిరి సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్
హైదరాబాద్: సెప్టెంబర్ 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ జడ్జి జీ.ఎస్.ఎల్.ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా కుషాయిగూడలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టుల సముదాయం హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ లోక్ అదాలత్ సెప్టెంబర్ 1వ తేదీ నుండే ప్రారంభించామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కుటుంబ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, క్రిమినల్ కేసులు, విడాకుల కేసులు ఇతర ఆర్థిక లావాదేవీల కేసులతో పాటు యాక్సిడెంట్ లాంటి అన్ని రకాల కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.
ఎలాంటి కేసులు ఉన్నా న్యాయసేవాధికారులు, కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో తమతమ కేసులను పరిష్కరించుకుని సమాజంలో స్వేచ్ఛగా జీవించాలని జడ్జి ప్రియాంక ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.




