Medchal: జవహర్‌నగర్‌లో రోడ్డు కబ్జాకు యత్నం.. ఆందోళనలో కాలనీవాసులు
Medchal: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ సంతోష్ నగర్‌లో 25 ఏళ్ల రోడ్డును కబ్జా చేసేందుకు యత్నం. రాత్రికి రాత్రే అడ్డుగోడ కట్టాలని చూస్తున్న భూ కబ్జాదారులు.
Medchal: జవహర్‌నగర్‌లో రోడ్డు కబ్జాకు యత్నం.. ఆందోళనలో కాలనీవాసులు
మేడ్చల్: మేడ్చల్ జిల్లా, కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ డివిజన్, సంతోష్ నగర్ కాలనీలో గత 25 సంవత్సరాలుగా ఉన్న రోడ్డుని కొంతమంది బూ కజ్జా దారులు స్థానిక నాయకులతో కలిసి రోడ్డు కబ్జాకు యత్నిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని గత కొన్ని నెలలుగా జిహెచ్ఎంసి అధికారులకు, రెవెన్యూ అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎన్ని సార్లు మోరపెట్టుకున్నా, అధికారులలో చలనం లేదు అని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో రోజులుగా అయ్యా ఇది సంగతి అని మొరపెట్టుకున్న న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి సంతోష్ నగర్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు.
Next Story




