Medchal: మేడ్చల్ పరిధిలో ఒకే రోజు నాలుగు ఇళ్లలో చోరీ
Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావల్ కోల్ గ్రామంలో ఒకే రోజు నాలుగు ఇళ్లలో భారీ చోరీ. 9 తులాల బంగారం, వెండి, నగదు అపహరణ.
Medchal: మేడ్చల్ పరిధిలో ఒకే రోజు నాలుగు ఇళ్లలో చోరీ
మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావల్ కోల్ గ్రామంలో ఒకే రోజు నాలుగు ఇండ్లల్లో చోరీ. గ్రామంలోని తారీగొప్పుల రాజమణి, బందెల నర్సమ్మ, సందీప్ రెడ్డి, స్వరూప ఇండ్లల్లో చోరికి పాల్పడిన దుండగుడు.
ఈ నాలుగు ఇండ్లల్లో ఎవరు లేకపోవడంతో అర్ధరాత్రి దొంగతనానికి ప్లాన్ వేసిన దొంగ. అక్సల్ బ్లేడ్ తో తాళాలు కోసి పెద్ద మొత్తం లో బంగారం, వెండి, నగదు దోపిడీ.
బందెల నర్సమ్మ ఇంట్లో నుండి 9తులాల బంగారం, 80 తులాల వెండి, 2లక్షల నగదు అపహారించిన దుండగుడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన మేడ్చల్ పోలీసులు.
Next Story




