Medchal: మేడ్చల్‌లో అనధికార ఆసుపత్రులపై డీఎంహెచ్‌వో కొరడా: రెండు సీజ్!

Medchal: మేడ్చల్‌లో నిబంధనలు పాటించని చిన్న, సాక్షి ఆసుపత్రులను సీజ్ చేసిన డీఎంహెచ్‌వో డాక్టర్ ఆనంద్. స్వరూప నర్సింగ్ హోమ్‌కు నోటీసులు జారీ.

NAKSHATRAM, MEDCHAL
Published on: 12 Sept 2026 12:29 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్‌లో అనధికార ఆసుపత్రులపై డీఎంహెచ్‌వో కొరడా: రెండు సీజ్!

Medchal: మేడ్చల్‌లో అనధికార ఆసుపత్రులపై డీఎంహెచ్‌వో కొరడా ఝళిపించారు. నిబంధనలు పాటించకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన చిన్న,సాక్షి ఆసుపత్రులను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు.డీఎంహెచ్‌వో డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఆసుపత్రుల అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించారు.అదేవిధంగా మేడ్చల్‌లోని స్వరూప నర్సింగ్ హోమ్‌లోనూ తనిఖీలు నిర్వహించి, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం నోటీసులు జారీ చేశారు.అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL