Tandur: తాండూరులో ఘనంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ!

Tandur: ప్రధాని మోదీ పిలుపు మేరకు తాండూరులో 'హర్‌ ఘర్‌ తిరంగా' భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు.

Srikanth Reddy, Tandur
Updated on: 14 Aug 2026 1:47 PM IST
Tandur
X

Tandur: తాండూరులో ఘనంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ!

Tandur: తాండూరు పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. తిరంగా యాత్ర అభియాన్ కమిటీ తాండూరు...ఆధ్వర్యంలో ప్రధాన కూడల్లలో విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు.

భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థులు ‘వందేమాతరం’, ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండా విశిష్టత, దేశభక్తి, జాతీయ సమైక్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.....

భారత జాతీయ పతాకానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు.

1921లో జరిగిన ఓ సభలో పింగళి వెంకయ్య జాతీయ పతాక రూపకల్పనను మహాత్మా గాంధీకి అందించారని తెలిపారు. అనంతరం 1931లో జాతీయ పతాకానికి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మూడు రంగులను కేటాయించినట్లు వివరించారు. 1947 జూలై 22న రాజ్యాంగ సభ జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆమోదించిందని, అదే ఏడాది ఆగస్టు15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం త్రివర్ణ పతాకం భారత జాతీయ పతాకంగా అధికారిక గుర్తింపు పొందిందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని గౌరవించి, దేశభక్తి భావనను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ తిరంగా ర్యాలీలో పట్టణ పుర ప్రముఖులు, వ్యాపారస్తులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, కార్యకర్తలు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story