Nacharam: నాచారం శాంతి గార్డెన్స్‌లో సామూహిక కుంకుమ పూజలు!

Nacharam: నాచారం శాంతి గార్డెన్స్ అపార్ట్‌మెంట్‌లో భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమ పూజలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు, అన్నసమారాధన.

HARISH, TARNAKA
Published on: 16 Sept 2026 2:07 PM IST
Nacharam
X

Nacharam: నాచారం శాంతి గార్డెన్స్‌లో సామూహిక కుంకుమ పూజలు!

Nacharam: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాచారం శాంతి గార్డెన్స్ అపార్ట్‌మెంట్‌లో సామూహిక కుంకుమ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో తొలుత గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం పలువురు మహిళలు సామూహికంగా కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలను అపార్ట్‌మెంట్‌ వాసులందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు అపార్ట్‌మెంట్‌ వాసుల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం భక్తులు, అపార్ట్‌మెంట్‌ వాసులకు అన్నసమారాధన నిర్వహించారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA