Hyderabad: హైదర్‌నగర్‌లో ఆనంద్ కుమార్ పాటిల్ జ్ఞాపకార్థం అన్నసమారాధన!

Hyderabad: కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో ఆనంద్ కుమార్ పాటిల్ జన్మదినాన్ని పురస్కరించుకుని మిత్ర మండలి ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు.

Maruthisagar, Kukatpally
Published on: 19 Aug 2026 7:14 PM IST
Hyderabad
X

Hyderabad: హైదర్‌నగర్‌లో ఆనంద్ కుమార్ పాటిల్ జ్ఞాపకార్థం అన్నసమారాధన!

Hyderabad: ఆనంద్ కుమార్ పాటిల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆనంద్ కుమార్ మిత్ర మండలి ఆధ్వర్యంలో హైదర్‌నగర్‌లో అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 1,000 మందికి అన్నదానం చేశారు.

ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మిత్రులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని, స్నేహ జ్ఞాపకాలను మిత్రులు గుర్తుచేసుకున్నారు.

ఆనంద్ కుమార్ పాటిల్ భౌతికంగా దూరమైనప్పటికీ, ఆయనతో ఉన్న స్నేహబంధం, మధుర జ్ఞాపకాలు తమ హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story