Tandur: వివాహిత మృతి - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు!

Tandur: తాండూరు ఎన్టీఆర్ నగర్ కాలనీలో వివాహిత మమత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Srikanth Reddy, Tandur
Published on: 4 Sept 2026 3:17 PM IST
Tandur
X

Tandur: వివాహిత మృతి - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు!

Tandur: మృతురాలు ఉప్పరి మమత(23) భర్త ఉప్పరి అనిల్ ఎన్టీఆర్ నగర్ కాలనీ తాండూరు పట్టణం లో నివాసం ఉంటున్నారన్నారు. గురువారం ఉదయం మృతురాలు ఉప్పరి మమతకు ఎంతకూ మెలకువ రాక పోవడంతో ఆమె అత్తమామలు ఎంత పిలిచిన పలకకపోవడంతో తాండూరు జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా డ్యూటీ డాక్టర్ పరీక్షించి మరణించిందని ధృవీకరించారన్నారు. ఈ విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు తెలియజేయగా వారు పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగిందన్నారు. తమ కూతురిని 4 నెలల క్రితం ఎన్టీఆర్ నగర్ కాలనీ కి చెందిన ఉప్పరి అనిల్ కు ఇచ్చి వివాహం చేయడం జరిగిందని, ఉదయం ఏడు గంటల ప్రాంతంలో తమకు ఫోన్ ద్వారా తమ కూతురు చనిపోయిందని సమాచారం అందించారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారన్నారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరమేశ్ గౌడ్ తెలిపారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story