LB Nagar: భూలక్ష్మినగర్‌లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం!
LB Nagar: భూలక్ష్మినగర్‌లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన మల్‌రెడ్డి రాంరెడ్డి. MNJ క్యాన్సర్ ఆస్పత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో పరీక్షలు.
LB Nagar: భూలక్ష్మినగర్‌లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం!
LB Nagar: భూలక్ష్మినగర్ కాలనీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, వయోవృద్ధుల సేవాసమితి వారి సౌజన్యంతో స్థానిక కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ శ్రీ మల్‌రెడ్డి రాంరెడ్డి గారు హాజరై శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఎమ్.ఎన్.జె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రం (MNJ Cancer Hospital) అనుభవజ్ఞులైన వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి గారు మాట్లాడుతూ "వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం (Early Detection) ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. సీనియర్ సిటిజన్ల ఆరోగ్యం కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయం. సేవా దృక్పథంతో పనిచేస్తున్న కాలనీ అసోసియేషన్ మరియు వయోవృద్ధుల సేవాసమితి నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు."
ఈ కార్యక్రమంలో భూలక్ష్మినగర్, కమలానగర్, ద్వారకామయి నగర్, శారదా నగర్, సుభద్రానగర్, హైకోర్టు కాలనీ, రాజపునగర్ తదితర పరిసర ప్రాంతాల సీనియర్ సిటిజన్లు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహా రెడ్డి గారు, కళ్లెం నవజీవన్ రెడ్డి గారు, ఏఎంసీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు సంరెడ్డి భుజంగా రెడ్డి గారు, పటోళ్ల మాధవ రెడ్డి గారు, సోలిపురం వెంకట్రామ్ రెడ్డి గారు, జానీ భాయ్ గారు, సామ రోహిత్ రెడ్డి గారు, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, వయోవృద్ధుల సేవాసమితి స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.




