Malkajgiri: ఏఎస్‌ఐగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్ జంగయ్య
Malkajgiri: మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వై. జంగయ్య ఏఎస్‌ఐగా పదోన్నతి పొందారు. ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ ఆయనకు ఏఎస్‌ఐ స్టార్స్ తొడిగి అభినందించారు.
Malkajgiri: ఏఎస్‌ఐగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్ జంగయ్య
మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో గత ఆరు సంవత్సరాలుగా హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వై. జంగయ్య అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు.27 సంవత్సరాల పోలీస్ శాఖ సేవల అనంతరం పదోన్నతి లభించింది.
ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ జంగయ్యకు ఏఎస్‌ఐ స్టార్స్‌ను అందజేసి అభినందించారు. ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది జంగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
పదోన్నతి తనపై మరింత బాధ్యతను పెంచిందని ఏఎస్‌ఐ జంగయ్య తెలిపారు.విధి నిర్వహణలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఓర్పుతో సేవలందిస్తానని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Next Story




