Malkajgiri: ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి - ఎస్ఎఫ్ఐ డిమాండ్
Malkajgiri: విద్యా వ్యాపారీకరణను అరికట్టి ప్రభుత్వ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని జిల్లా కార్యదర్శి కార్తీక్ డిమాండ్ చేశారు.
Malkajgiri: ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి - ఎస్ఎఫ్ఐ డిమాండ్
మల్కాజిగిరి: విద్యను వ్యాపార వస్తువుగా మార్చి విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న విధానాలను అరికట్టి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ మెద్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తీక్ డిమాండ్ చేశారు. మల్కాజిగిరి మండల ఎస్ఎఫ్ఐ నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, తరగతి గదులు, అధ్యాపకుల కొరతను పరిష్కరించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మల్కాజిగిరిలో షిఫ్ట్ విధానంలో కొనసాగుతున్న ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలకు ప్రత్యేక భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు, అనధికారిక వసూళ్లను నియంత్రించాలని అన్నారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేపడతామని కార్తీక్ తెలిపారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్, డీసీ కమిటీ సభ్యుడు మాథ్యూ పాల్గొన్నారు.
నూతన కమిటీ: అధ్యక్షుడిగా అనిరుధ్, కార్యదర్శిగా యశ్వంత్, సహాయ కార్యదర్శులుగా శ్రావ్య, యశ్వంత్, ఉపాధ్యక్షులుగా శివ, సాత్విక్ ఎన్నికయ్యారు. 16 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.




