Malkajgiri: మల్కాజిగిరిలో 'సహచారిణి–2026' అవగాహన సదస్సు

Malkajgiri: మల్కాజిగిరిలో 'సహచారిణి–2026' కార్యక్రమం. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ డీసీపీ కె. రాహుల్ రెడ్డి.

Bodike Manohar, Malkajgiri
Published on: 7 Aug 2026 4:47 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరిలో 'సహచారిణి–2026' అవగాహన సదస్సు

మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "సహచారిణి–2026" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మల్కాజిగిరిలోని శుభం కన్వెన్షన్ హాల్‌లో మహిళా సమాఖ్య సభ్యులతో అవగాహన సమావేశం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ డీసీపీ కె. రాహుల్ రెడ్డి మాట్లాడుతూ, "మీ సురక్ష–సహచరి" కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్ది, ప్రజలకు–పోలీసులకు మధ్య సమాచార వారధిగా పనిచేసేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

మహిళల భద్రతతో పాటు సైబర్ నేరాల నివారణ,రోడ్డు భద్రతా నిబంధనలు, పోలీసు శాఖ అందిస్తున్న సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. నేటి సమాజంలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడంలో స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈకార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ పి.సుబ్బయ్య, మల్కాజిగిరి ఎస్‌హెచ్‌ఓ ఎస్.విజయకుమార్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. నరసింహ,సెక్టార్ ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది,మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story