Malkajgiri: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మహిళలతో రాఖీ వేడుకలు
Malkajgiri: మల్కాజిగిరి పోలీసు కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు కస్తూరిబా నగర్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి పోలీసులు రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Malkajgiri: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మహిళలతో రాఖీ వేడుకలు
మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీసు కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి పోలీసులు రాఖీ పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో కస్తూరిబా నగర్ లో రాఖీ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. మహిళలు తమ పరిసర ప్రాంతాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.నేరాల నియంత్రణలో పోలీసులతో కలిసి మహిళలు కూడా తమవంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.
మహిళల భద్రత, నేరాల నియంత్రణకు పోలీసులతో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే రాఖీ వేడుకల ఉద్దేశమని తెలిపారు. సీఐ తో పాటు సెక్టార్ ఎస్ఐలు శంకర్, శ్రీనివాస్ దుర్గా నగర్ లో మల్కాజిగిరిలో సహచర బృందం మహిళలతో, మహిళా పోలీస్ సిబ్బందితో రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.




