Malkajgiri: జవహర్‌నగర్‌లో నిర్మాణాల అనుమతుల సమస్యకు పరిష్కారం!

Malkajgiri: జవహర్‌నగర్, చంద్రపురి కాలనీలలో 30 ఏళ్లుగా ఉన్న నిర్మాణ అనుమతుల సమస్యను పరిష్కరిస్తామని కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు.

PURENDAR, ALWAL
Published on: 27 Aug 2026 9:12 PM IST
Malkajgiri
X

Malkajgiri: జవహర్‌నగర్‌లో నిర్మాణాల అనుమతుల సమస్యకు పరిష్కారం!

మల్కాజ్గిరి: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్లలో పర్యటించిన కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి. జవహర్ నగర్ లో ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న వారికి 30 సంవత్సరాల నుండి ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు లేనందున ఈ సమస్య పరిష్కారానికై కమిషనర్ పర్యటించి పరిష్కార దిశగా చర్యలు చేపడతామని అన్నారు 58,59, జీవో గ్రామ కంఠం లో ఉన్న నివాసాలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రామలింగం. చంద్రపూర్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాసరెడ్డి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story