Malkajgiri: మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన!

Malkajgiri: మల్కాజిగిరి పరిధిలోని న్యూ మిర్జాల్‌గూడ, వేణాపాణి నగర్, యాదవ్ నగర్‌లలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 12 Aug 2026 10:52 PM IST
Malkajgiri
X

Malkajgiri: మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన!

మల్కాజ్గిరి: ప్రజలకు మెరుగైన పౌర సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం న్యూ మిర్జాల్‌గూడ, వేణాపాణి నగర్, యాదవ్ నగర్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, రహదారుల నిర్వహణ, చెత్త సేకరణ,రోడ్డు ఆక్రమణలు,సీ అండ్ డీ వ్యర్థాలు,మ్యాన్‌హోళ్ల పరిస్థితి, పట్టణ పచ్చదనం తదితర అంశాలను అధికారులతో కలిసి పరిశీలించారు.

రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో బీటీ రోడ్డు ప్యాచ్‌వర్క్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.రోడ్లను ఆక్రమించి ఉన్న నిర్మాణాలు, అడ్డంకులను తొలగించాలని సూచించారు. సీ అండ్ డీ వ్యర్థాలు, పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.అలాగే ఆటో ద్వారా ఇంటింటి చెత్త సేకరణను మరింత బలోపేతం చేయాలని, మ్యాన్‌హోళ్లను రోడ్డు స్థాయికి పెంచి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు.

ఖాళీ ప్రదేశాలను శుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాంటర్ బాక్స్‌లను మరింత పటిష్టంగా ఏర్పాటు చేసి వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.పర్యటనలో ఎస్ఈ లక్ష్మణ్, డిప్యూటీ కమిషనర్ జాకియా సుల్తాన్ ఈఈ, డీఈ, ఏఈలు,ఏసీపీ శ్రీనివాస్, శానిటేషన్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ తదితర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన,మెరుగైన వాతావరణం కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story