Malkajgiri: మల్కాజిగిరిలో చికిత్స కోసం వచ్చి అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు!
Malkajgiri: వైద్యం కోసం మెదక్ నుంచి మల్కాజిగిరి వచ్చిన రైతు నాగభూషణం అదృశ్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మల్కాజిగిరి పోలీసులు.
Malkajgiri: మల్కాజిగిరిలో చికిత్స కోసం వచ్చి అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు!
మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మేదక్ జిల్లా మాసాయిపేట మండలం బొమ్మారం గ్రామానికి చెందిన కుమ్మరి నాగభూషణం (50) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు.
ఆగస్టు 31న అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం మల్కాజిగిరికి వచ్చి ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. అనంతరం సెప్టెంబర్ 6న భవానీనగర్‌లోని ఇంటి నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయాడు.అప్పటి నుంచి అతని ఆచూకీ లభించలేదు.
అదృశ్యమైన వ్యక్తి ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు, కోలముఖం, చామనచాయ రంగు కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నాగభూషణం ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా కనిపించిన వారు 7893299671 నంబర్‌కు లేదా మల్కాజిగిరి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.




