Malkajgiri: భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త అరెస్ట్ మల్కాజిగిరి
Malkajgiri: మల్కాజిగిరిలో భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితుడు నవీన్ కుమార్ అరెస్ట్. బిఎన్ఎస్ సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు.
Malkajgiri: భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త అరెస్ట్ మల్కాజిగిరి
మల్కాజిగిరి: వివాహితను నిరంతరం వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో భర్తను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మౌలాలి జవహర్‌నగర్‌లోని అక్షయ టవర్స్‌కు చెందిన వై. శరణ్య (34)కు 14 సంవత్సరాల క్రితం యల్లుగుల నవీన్ కుమార్‌తో వివాహం జరిగింది.
నిందితుడు మద్యానికి బానిసై,ఆర్థికంగా అప్పులు చేస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు భార్యను తరచూ మానసికంగా వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులు భరించలేక శరణ్య బొద్దింకల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది.చికిత్స పొందుతూ ఈ నెల 25న మృతి చెందగా
మృతురాలి తండ్రి అశోక్ అకునూరు ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం.504/2026గా తొలుత భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 85 రీడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు.అనంతరం దర్యాప్తులో సాక్షుల వాంగ్మూలాలు,ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు కేసులో BNS సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం)ను చేర్చారు.
ఈ మేరకు శుక్రవారం నిందితుడు యల్లుగుల నవీన్ కుమార్ (41), సిద్ధార్థ నగర్ కాలనీ, దమ్మాయిగూడ నివాసిని అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు,కేసు దర్యాప్తు కొనసాగుతోందని మల్కాజిగిరి పోలీసులు వెల్లడించారు.




