Malkajgiri: మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో "తెలుగు పద్యం – వ్యక్తిత్వ వికాసం"

Malkajgiri: మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు పద్యం - వ్యక్తిత్వ వికాసంపై సదస్సు. ముఖ్య వక్తగా గజ్వేల్ అధ్యాపకులు డా. ఆర్. మహేందర్ రెడ్డి హాజరు.

Bodike Manohar, Malkajgiri
Published on: 30 July 2026 8:12 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో "తెలుగు పద్యం – వ్యక్తిత్వ వికాసం"

మల్కాజ్గిరి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మల్కాజిగిరిలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో గురువారం "తెలుగు పద్యం -వ్యక్తిత్వ వికాసం" అంశంపై విస్తృతోపన్యాస కార్యక్రమం నిర్వహించారు .‌ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,గజ్వేల్‌కు చెందిన తెలుగు అధ్యాపకులు డా.ఆర్. మహేందర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన తెలుగు పద్యసాహిత్యంలోని జీవన విలువలు, సందేశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు.వివిధ సందర్భాలకు సంబంధించిన పద్యాలను హృద్యంగా ఆలపిస్తూ వాటి భావాన్ని విశదీకరించారు.ఆయన పద్యగానం,వ్యాఖ్యానం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుని కార్యక్రమాన్ని ఆసక్తికరంగా మార్చాయి. వ్యక్తిత్వ వికాసానికి పద్యసాహిత్యం ఉత్తమ మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని తెలుగు విభాగాధిపతి పి.శైలజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. అడవిరాజు ఇలాంటి విద్యాపరమైన కార్యక్రమాలు విద్యార్థుల్లో భాషా నైపుణ్యంతో పాటు విలువలను పెంపొందిస్తాయని తెలిపారు.

తెలుగు అధ్యాపకులు డా. శోభన్ బాబు, ప్రొఫెసర్ వెంకట రెడ్డి, ఐక్యూఏసి కో ఆర్డినేటర్ డా. రాజేశ్ కుమార్ అకడమిక్ కో ఆర్డినేటర్ గుణాకర్, డాక్టర్ జి ఎన్ జగన్, డాక్టర్ బ్రిజేశ్,అధ్యాపక బృందం,విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story