Malkajgiri: నాగారంలో యూటర్న్ ఓపెన్ చేయాలని డీసీపీకి వినతి!
Malkajgiri: నాగారం డివిజన్ పరిధిలో మూసివేసిన యూటర్న్‌ను తెరిపించాలని మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీకి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు.
Malkajgiri: నాగారంలో యూటర్న్ ఓపెన్ చేయాలని డీసీపీకి వినతి!
Malkajgiri: నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ,యువ నాయకులు కౌకుట్ల జీవన్ రెడ్డి కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ విషయంపై డీసీపీ రాహుల్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సైట్‌ను స్వయంగా విజిట్ చేసి, పరిస్థితులను పరిశీలించిన అనంతరం యూటర్న్‌ను తిరిగి ఓపెన్ చేసేందుకు అవసరమైన చర్యలు.
తీసుకుంటామని హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యూటర్న్ మూసివేయడం వల్ల ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో గనపురం కొండల్ రెడ్డి , గూడూరు కృష్ణ గౌడ్ , సెరినిటీ స్కూల్ ప్రిన్సిపల్ నోముల జంగీ రెడ్డి , సుబ్బారావు , దాసోహం నర్సింగ్ రావు , దాసరి రాంరెడ్డి , పంగా సంతోష్ , బుల్లబోయిన ప్రవీణ్ యాదవ్ , మామిళ్ల శేఖర్ యాదవ్ షేక్ గౌస్ ,కిష్టాన్న రవి,మహమ్మద్ తాలీం , సత్యం గౌడ్ , మిడాల సతీష్ , మనోహర్ చెల్లా, సింహాపురి కాలనీ ప్రెసిడెంట్ మహేష్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.




