Medipally: బోడుప్పల్‌లో కొత్త పోలీస్ స్టేషన్ సీపీ సుమతి తనిఖీ!

Medipally: మేడిపల్లిలో నిర్మిస్తున్న మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్ భవనాన్ని దసరా నాటికి ప్రారంభిస్తామని సీపీ సుమతి తెలిపారు.

KARUNAKAR, UPPAL
Published on: 13 Aug 2026 4:25 PM IST
Medipally
X

Medipally: బోడుప్పల్‌లో కొత్త పోలీస్ స్టేషన్ సీపీ సుమతి తనిఖీ!

Medipally: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మేడిపల్లికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని సీపీ సుమతి తెలిపారు. గురువారం మేడిపల్లి ఏసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్‌తో కలిసి ఏసీపీ మోహన్ కుమార్, పరిధిలోని ఇన్‌స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

పెండింగ్ కేసులు, సిబ్బంది, శాంతిభద్రతలపై ఆరా తీసి, ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ మేడిపల్లిలో నిర్మిస్తున్న మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్ భవన నిర్మాణం దాదాపు పూర్తయిందని తెలిపారు.

దసరా నాటికి హెడ్‌క్వార్టర్స్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రస్తుతం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లోనే ఏసీపీ కార్యాలయం కొనసాగుతోందని, ఏసీపీ కార్యాలయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నందున ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్ పోలీస్‌స్టేషన్‌గా మేడిపల్లి.మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. దీనిని కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్ పోలీస్‌స్టేషన్‌గా మార్చే ప్రక్రియ చేపడుతున్నట్లు సీపీ సుమతి తెలిపారు.

క్రైమ్ గణాంకాల ఆధారంగా పోలీస్‌స్టేషన్ల పునర్విభజన.కమిషనరేట్ ఏర్పడిన అనంతరం ఏడాది చివర్లో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన నేరాల సంఖ్యను పరిశీలిస్తామని సీపీ తెలిపారు. అవసరమైన చోట పోలీస్‌స్టేషన్ల పునర్విభజనకు ప్రతిపాదనలు పంపుతామని వెల్లడించారు.

మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని క్రైమ్ గణాంకాల ఆధారంగా బోడుప్పల్‌లో కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story