Malkajgiri: మౌలాలిలో నూతన ఎస్సీ సెల్ నాయకులకు ఘన సన్మానం!

Malkajgiri: మౌలాలి డివిజన్‌లో కాంగ్రెస్ నూతన ఎస్సీ సెల్ నాయకులకు ఘన సన్మానం. పదవులు కేటాయించినందుకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ధన్యవాదాలు.

Bodike Manohar, Malkajgiri
Published on: 12 Sept 2026 1:37 PM IST
Malkajgiri
X

Malkajgiri: మౌలాలిలో నూతన ఎస్సీ సెల్ నాయకులకు ఘన సన్మానం!

Malkajgiri: కాంగ్రెస్‌ పార్టీకి నూతనంగా పదవులు పొందిన ఎస్సీ సెల్‌ నాయకులను 186 మౌలాలి డివిజన్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీన్‌హిల్స్‌ కాలనీలో ఘనంగా సన్మానించారు. డివిజన్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పోతుల వినోద్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్‌ కార్యదర్శిగా మంద భాస్కర్‌ మాదిగ,జిల్లా ఎస్సీ సెల్‌ కన్వీనర్‌గా ప్రేమ్‌,మల్కాజిగిరి బి-బ్లాక్‌ సర్కిల్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా ధరణి, 186 మౌలాలి డివిజన్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా చరణ్‌ పదవులు పొందిన సందర్భంగా వారిని అభినందించారు.

గ్రీన్‌హిల్స్‌ కాలనీ అధ్యక్షుడు దశరథ్‌రెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన నాయకులు మాట్లాడుతూ తమకు పదవులు కల్పించిన మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ కోసం మరింత అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో 186 మౌలాలి డివిజన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటేశ్వరరావు, జనరల్‌ సెక్రటరీ వకీల్‌ సలీం, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు హమీద్‌ భాయ్‌, చందు, అరుణ్‌ తదితరులతో పాటు కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri