Malkajgiri: బూత్‌లలో అర్హులెవరికీ ఓటు తప్పిపోవద్దు: కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లు!
Malkajgiri: ఓటర్ల జాబితా పునఃసమీక్షపై కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. అర్హులైన వారందరికీ ఫామ్-6 ద్వారా ఓటు హక్కు కల్పించాలని నేతలు బీఎల్‌ఏలకు సూచించారు.
Malkajgiri: బూత్‌లలో అర్హులెవరికీ ఓటు తప్పిపోవద్దు: కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లు!
మల్కాజిగిరి: మల్కాజిగిరి ఎస్ ఐ ఆర్ ఓటర్ జాబితాల పునర్ సమీక్ష సమావేశం మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మల్కాజిగిరి బాలాజీ ఫంక్షన్ లో జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ సుబ్రహ్మణ్యం,అసెంబ్లీ ఇన్చార్జ్ షమీర్ కౌశిక్ లు హాజరై కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఏ లకు తమ తమ బూతులలో ఓటు తప్పిపోకుండా చూసుకునేందుకు ఫామ్ 6 ద్వారా నమోదు చేసి ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని చెప్పారు. ఈ ప్రక్రియ అయ్యేంతవరకు కష్టపడి పనిచేయాలని ప్రతి నాయకుడు కార్యకర్త దీనిపై శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ జితేంద్రనాథ్ మల్కాజిగిరి ఇంచార్జ్ లక్ష్మీకాంతరెడ్డి,బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ బి కే శ్రీనివాస్ అశోక్ రెడ్డి,పిట్టల శ్రీనివాస్,డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్ వైనాల ప్రవీణ్ సత్యమూర్తి, యూసుఫ్ భాయ్,పిట్టల నాగరాజు, శ్రీకాంత్ ముదిరాజ్, వినోద్ యాదవ్, ఇందిర ప్రియదర్శిని రోజా రమణి ప్రభా,ఆశా,శారద,మంద భాస్కర్,బాబు, సత్యనారాయణ,ఫరీద్, సయ్యద్ మబ్బు,ఫరూక్, సురేష్ సింగ్,పార్థసారధి, బ్రహ్మయ్య,రామక్రిష్ణ, వెంకన్న,జీడి చరణ్ జిత్ గౌడ్,చుంకూ శ్రీనివాస్,, తదితరులు పాల్గొన్నారు.




