Malkajgiri: నేరేడ్‌మెట్‌లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదన - ముగ్గురు అరెస్ట్
Malkajgiri: నేరేడ్‌మెట్‌లో చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు. ముగ్గురు నిందితుల అరెస్ట్, 7 తులాల బంగారం, బైక్ స్వాధీనం.
Malkajgiri: నేరేడ్‌మెట్‌లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదన - ముగ్గురు అరెస్ట్
మల్కాజిగిరి: మల్కాజిగిరి నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు.ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి,వారి నుంచి సుమారు 7 తులాల బంగారు ఆభరణాలతో పాటు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 12న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నేరేడ్‌మెట్ పరిధిలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును నిందితులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించారు.
ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు నేరేడ్‌మెట్ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు వారు అంగీకరించినట్లు మల్కాజిగిరి ఏసీపి యాదగిరి రెడ్డి,సిఐ వెంకటయ్య లు మీడియా సమావేశంలో తెలిపారు.
అరెస్టయిన వారిలో 19 ఏళ్ల రోహిత్ ఆర్య, 30 ఏళ్ల మహమ్మద్ సోను, 20 ఏళ్ల అసీం ఉన్నారు. వారి నుంచి సుమారు 7 తులాల బంగారం, టీఎస్08బీఈ6819 నంబర్ గల ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మల్కాజిగిరి జోన్ డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో నేరేడ్‌మెట్ పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఎస్‌ఐ సాయి అవినాష్, ఎస్‌ఐ జి. బాలరాజు, క్రైమ్ టీమ్, సైబర్ క్రైమ్ టీమ్ నిందితుల పట్టుకోవడం ఇంట్లోలో కీలకంగా వ్యవహరించారు.




