Malkajgiri: మల్కాజిగిరిలో బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి నేతలు

Malkajgiri: మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు. ఈ నెల 23న భారీ బహిరంగ సభ.

Bodike Manohar, Malkajgiri
Published on: 18 Aug 2026 7:39 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరిలో బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి నేతలు

మల్కాజిగిరి: మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏకే మురుగేష్, టీఎన్ కృష్ణ గౌడ్, జెగ్ మహేష్ గౌడ్, ఎల్లేష్ శ్రీనివాస్ రెడ్డితో పాటు సుమారు 30 మంది బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని అన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఈ నెల 23వ తేదీన మల్కాజిగిరిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మైనంపల్లి హనుమంతరావు వెల్లడించారు. ఈ సభలో ఉద్యమకారులతో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గుండా నిరంజన్, ఆకుల శ్రీనివాస్ గౌడ్, యోగేందర్, మల్లికార్జున్, దేవి, ఈశ్వర్, బాలరాజు, సూరి, మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story