Malkajgiri: బోనాల ఏర్పాట్ల పరిశీలన భక్తులకు ఇబ్బందులు కలగొద్దు: జోనల్ కమిషనర్

Malkajgiri: ల పండుగను పురస్కరించుకుని మల్కాజిగిరి సర్కిల్‌లోని ఆలయాల్లో పౌర సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జోనల్ కమిషనర్.

Bodike Manohar, Malkajgiri
Published on: 5 Aug 2026 9:18 PM IST
Malkajgiri
X

Malkajgiri: బోనాల ఏర్పాట్ల పరిశీలన భక్తులకు ఇబ్బందులు కలగొద్దు: జోనల్ కమిషనర్

మల్కాజిగిరి: బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన పౌర సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టిన ఏర్పాట్లను మల్కాజిగిరి జోనల్ కమిషనర్ బుధవారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని పలు ఆలయాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆలయాల పరిసరాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, రహదారుల పరిస్థితి, డ్రైనేజీ వ్యవస్థ, ఘన వ్యర్థాల నిర్వహణ, దోమల నివారణ చర్యలను సమగ్రంగా పరిశీలించారు. భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంతో పాటు అన్ని పౌర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు.పండుగ కాలమంతా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని,భక్తులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ పేర్కొన్నారు.క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్,డీఈఈ (ఎస్‌డబ్ల్యూఎం), డీఈఈ (ఎలక్ట్రికల్), డీడీ (యూబీడీ),ఏఈ (మెయింటెనెన్స్)తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story