Malkajgiri: మల్కాజిగిరిలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి బీజేపీ

Malkajgiri: మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు. రోడ్ల మరమ్మతులు, గుర్రపుడెక్క తొలగింపు, తాగునీటి సమస్యలపై వినతి.

Bodike Manohar, Malkajgiri
Published on: 3 Aug 2026 7:27 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరిలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి బీజేపీ

మల్కాజిగిరి: మల్కాజిగిరి ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ను వారి కార్యాలయంలో మల్కాజిగిరి నియోజకవర్గ బిజెపి నాయకులు కలసి మెమోరండాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజిగిరి ప్రాంతంలో ప్రజలు రోడ్లు మరమ్మత్తు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రోడ్డు మరమత్తు పనులను చేపట్టాలన్నారు మిర్జాల్ గూడా చిన్మయి మార్గ్ నీటిముంపు సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన ప్రణాళికతో పనులను త్వరితగతిన చేయాలని కోరినట్లు చెప్పారు.

సఫిల్గుడా, బండ చెరువు లలో గుర్రపు డెక్క పెరిగి విపరీతమైన దోమలతో ప్రజలు సతమతమవుతున్నారని గుర్రపు డెక్కన్ తొలగించి దోమలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు.గౌతమ్ నగర్ డివిజన్ ఐ ఎన్ నగర్ లో నీటి సమస్య ఉందని నీటి సరఫరా విషయంలో చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎస్. శ్రీనివాస్ ముదిరాజ్

బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు,సునీత యాదవ్ మాజీ కార్పొరేటర్,ప్రసణ,జీడి బాలచందర్ గౌడ్,ఉడుత నవీన్,నాగరాజు, ధనలక్ష్మి,అంజలి,సోమా శ్రీనివాస్,భరత్ యాదవ్ తేజ,గణ,ప్రకాష్,మనోజ్, చందు,కిరణ్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story