Amanagal: శెట్టిపల్లిలో మాల పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన!
Amanagal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం శెట్టిపల్లిలో మాల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన్న సర్పంచ్, గ్రామ ప్రజలు.
Amanagal: శెట్టిపల్లిలో మాల పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన!
Amanagal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం బోనాల పండుగ సందర్భంగా శెట్టిపల్లి గ్రామంలో మాల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ గ్రామ ప్రజలు పెద్దలు యువకులు కలిసి ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
విగ్రహ దాత పొనుగోటి అర్జున్ రావు సహకారంతో, గ్రామ సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ–వెంకటయ్య* ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా విగ్రహ దాతకు గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు గ్రామ యువకులు పెద్దలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మహోత్సవ కార్యక్రమనికి ఉప సర్పంచ్ బాలగోని కృష్ణ ప్రసాద్ గారు, వార్డు సభ్యులు టి.రాములు, టి.యదయ్య,మాడ్గుల స్రవంతి–అభిలాష్, కొప్పుల రాములు గౌడ్,గ్రామ పెద్దలు బాలమోని నర్సింహ గౌడ్,మాడ్గుల రాములు గౌడ్, బైండ్ల జంగయ్య, జవాజి రవి, కొమ్ము మైసయ్య, కొమ్ము రమేష్, గడిగ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ యూత్ సభ్యులు, యువతీ యువకులు, గ్రామ ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.




