Hyderabad: ఆటో డ్రైవర్ రవూఫ్ దారుణ హత్య కేసు ఛేదన
Hyderabad: మైలార్‌దేవుపల్లి అలీనగర్‌లో ఆటో డ్రైవర్ అబ్దుల్ రవూఫ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
Hyderabad: ఆటో డ్రైవర్ రవూఫ్ దారుణ హత్య కేసు ఛేదన
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మైలర్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి అలీనగర్ లో జరిగిన దారుణ హత్య కేసును ఛేదించిన పోలీసులు, మైలర్ దేవుపల్లి అలీ నగర్ లో జరిగిన ఆటో డ్రైవర్ అబ్దుల్ రవూఫ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు మహ్మద్ అబ్దుల్ రవూఫ్‌ను పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మహ్మద్ జావిద్ అలియాస్ హుక్కా జావిద్‌ను గుర్తించిన పోలీసులు.. అతని సహచరులతో కలిసి హత్యకు పథకం రచించినట్లు వెల్లడించారు. తన తమ్ముడు సాజిద్ మృతికి అబ్దుల్ రవూఫ్ కారణమని అనుమానిస్తూ జావిద్ పగ పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అబ్దుల్ రవూఫ్‌పై దాడి చేసేందుకు పథకం రచించినట్లు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో అబ్దుల్ రవూఫ్ ఆటోలో వెళ్తుండగా ముగ్గురు నిందితులు అడ్డగించారు. అనంతరం పెప్పర్ స్ప్రే ఉపయోగించి కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో అబ్దుల్ రవూఫ్ మృతి చెందాడు.
హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వారి వద్ద నుంచి 3 కత్తులు, 2 పెప్పర్ స్ప్రే బాటిళ్లు, నిందితులు ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సెప్టెంబర్ 4న తెల్లవారుజామున నిందితులు యాక్టివా బైక్‌పై పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో నిందితులపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహ్మద్ జావిద్‌పై మూడు కేసులు, మహ్మద్ అబ్దుల్లాపై ఒక కేసు ఉన్నట్లు వెల్లడించారు. డీసీపీ రాజేంద్రనగర్, ఏసీపీ చాంద్రాయణగుట్ట ఆధ్వర్యంలో పోలీసులు కేసును ఛేదించారు.




