Maheshwaram: మహేశ్వరంలో ఏబీవీపీ నిరసన.. ఫీజు బకాయిలు చెల్లించాలి

Maheshwaram: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏబీవీపీ నిరసన. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక.

K Sai, Maheswaram
Published on: 26 July 2026 2:25 PM IST
Maheshwaram
X

Maheshwaram: మహేశ్వరంలో ఏబీవీపీ నిరసన.. ఫీజు బకాయిలు చెల్లించాలి

మహేశ్వరం: ABVP నాయకుడు నునావత్ రాజేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు రూ.11,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు తమ చదువును కొనసాగించడంలో ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి వి ద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరిస్తూ, సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ABVP ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

K Sai, Maheswaram

K Sai, Maheswaram

Next Story