Jubilee Hills: రాజీవ్ నగర్ డివిజన్ ‘ఎస్‌ఐఆర్’ క్యాంప్‌లో ఎమ్మెల్యే!

Jubilee Hills: రాజీవ్ నగర్ డివిజన్ కళ్యాణ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ ఉచిత ఓటరు సహాయ కేంద్రాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు సందర్శించారు

RAJESH,	WEST ZONE
Published on: 9 July 2026 5:28 PM IST
Jubilee Hills
X

Jubilee Hills: రాజీవ్ నగర్ డివిజన్ ‘ఎస్‌ఐఆర్’ క్యాంప్‌లో ఎమ్మెల్యే!

జూబిలీ హిల్స్: నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజీవ్ నగర్ డివిజన్ పరిధిలోని కళ్యాణ్ నగర్ వెంచర్–3, లైబ్రరీ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ఉచిత సహాయ కేంద్రాన్ని నేడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు సందర్శించారు..

ఈ సందర్భంగా అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించి, కార్యకర్తలతో మాట్లాడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా సేవలు అందించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 2026 ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావడం ఎంతో ముఖ్యమని, ఓటరు జాబితా పరిశీలన, ఎస్‌ఐఆర్ దరఖాస్తుల నింపడం, సందేహాల నివృత్తి వంటి సేవలను కాంగ్రెస్ పార్టీ ఉచితంగా అందిస్తోందని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాజీవ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story