Madugula: బ్రాహ్మణపల్లి ప్లాట్ల యజమానులకు సర్పంచ్ విజ్ఞప్తి

Madugula: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం బ్రాహ్మణపల్లిలో ఖాళీ ప్లాట్లను 15 రోజుల్లో శుభ్రం చేయాలని సర్పంచ్ కోరుకోరు తిరుపతయ్య విజ్ఞప్తి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Aug 2026 6:24 PM IST
Madugula
X

Madugula: బ్రాహ్మణపల్లి ప్లాట్ల యజమానులకు సర్పంచ్ విజ్ఞప్తి

మాడుగుల: గ్రామ సర్పంచ్ కోరుకోరు తిరుపతయ్య విజ్ఞప్తి. బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, గ్రామంలో సొంత ప్లాట్లు కలిగి ఉన్న యజమానులు తమ ప్లాట్లలో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు మరియు ఇతర వ్యర్థాలను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ప్లాట్లలో చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల దోమలు, ఈగలు పెరిగి, పక్కనే నివసించే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. తద్వారా ప్రజారోగ్యానికి కూడా హాని కలిగే అవకాశం ఉంది. కావున ప్రతి ప్లాట్ యజమాని 15 రోజులలోపు తమ ప్లాట్‌ను పూర్తిగా శుభ్రం చేసుకోవాలని కోరుతున్నాము.

15 రోజులలోపు ప్లాట్‌ను శుభ్రం చేసుకోని పక్షంలో, గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం గ్రామ కార్యదర్శి ద్వారా సంబంధిత ప్లాట్‌కు నోటీసు ఇవ్వడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం మరియు గ్రామ పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాము.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story