LB Nagar: కేసీఆర్ వైఖరిపై ఎల్బీనగర్‌లో మధుయాష్కీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ!
LB Nagar: రూ.22 కోట్ల ప్రజాధనం తీసుకుంటూ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని మధుయాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు. ఎల్బీనగర్ నుంచి ఇందిరాపార్క్‌కు కాంగ్రెస్ భారీ ర్యాలీ.
LB Nagar: కేసీఆర్ వైఖరిపై ఎల్బీనగర్‌లో మధుయాష్కీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ!
LB Nagar: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మధుయాష్కీ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు భారీ ర్యాలీగా ఇందిరాపార్క్ వైపు బయలుదేరారు.
ప్రతిపక్ష నేత హోదాలో ఉంటూ అసెంబ్లీకి హాజరుకాకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్నారని కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూ.22.24 కోట్లపై కాంగ్రెస్ నిలదీత ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్‌కు గత రెండున్నరేళ్లలో రూ.22.24 కోట్ల ప్రజాధనం ఖర్చయిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రజల సొమ్ముతో హోదా, సౌకర్యాలు అనుభవిస్తూ.. ప్రజా సమస్యలపై స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
“ప్రజల కోసం అసెంబ్లీలో మాట్లాడని ప్రతిపక్ష నేత ఎందుకు? ప్రజల సొమ్ము ఖర్చు చేస్తూ ఫామ్‌హౌస్‌లో కూర్చోవడమేనా?” అంటూ ఘాటు విమర్శలు చేశారు.
కాంగ్రెస్ నేతల ప్రధాన ఆరోపణలు తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణ. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని విమర్శ. రూ.22.24 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి.. ప్రజలకు మాత్రం దూరంగా ఉండటం ఏమిటని ప్రశ్న. ఫామ్‌హౌస్‌లో ఉంటూ ప్రతిపక్ష నేత హోదా అనుభవించడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతల ఆగ్రహం.
ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే కాంగ్రెస్ నిరసన చేపడుతోందని వెల్లడి. కేసీఆర్ వైఖరికి నిరసనగా ఎల్బీనగర్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇందిరాపార్క్‌కు తరలివెళ్లారు. “ ప్రజల సొమ్ము.. ప్రజల కోసమే ఖర్చు కావాలి”.
ప్రజల నుంచి జీతభత్యాలు, సౌకర్యాలు పొందుతూ ప్రజలకు అందుబాటులో లేకపోవడం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలు అన్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడాలని.. లేదంటే ఆ హోదాపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.




