Vanasthalipuram: దొడ్డు బియ్యానికి చెక్ పేదల పళ్లెంలో సన్న బియ్యం!

Vanasthalipuram: ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ 1000 రోజుల పాలన వనస్థలిపురం రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీని పరిశీలించిన మధు యాష్కీ గౌడ్.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 5 Sept 2026 1:51 PM IST
Vanasthalipuram
X

Vanasthalipuram: దొడ్డు బియ్యానికి చెక్ పేదల పళ్లెంలో సన్న బియ్యం!

Vanasthalipuram: ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న తీరును ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ మధు యాష్కీగౌడ్ పరిశీలించారు.

వనస్థలిపురంలోని రేషన్ షాపులను సందర్శించిన ఆయన.. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సన్న బియ్యం పంపిణీపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా దొడ్డు బియ్యంతో ఇబ్బందులు పడ్డామని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం అందించడం ఎంతో మేలు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.

“ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వచ్చినా పర్వాలేదు.. సన్న బియ్యం కోసం ఎదురుచూస్తాం. నాణ్యమైన బియ్యం అందుతుండటంతో మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి” అంటూ లబ్ధిదారులు పేర్కొన్నారు.

అనంతరం మధు యాష్కీగౌడ్ మాట్లాడుతూ.. సోనియాగాంధీ ఆశీర్వాదం, రాహుల్‌గాంధీ అండదండలు, తెలంగాణ ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.

నాయకులు, ధనవంతులు, వ్యాపారస్తులు తినే నాణ్యమైన బియ్యమే పేదల కుటుంబాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్నది తెలుసుకునేందుకే రేషన్ షాపులను పరిశీలిస్తున్నామని చెప్పారు. పేదల పళ్లెంలో నాణ్యమైన అన్నం.. వారి ముఖాల్లో చిరునవ్వు — ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని మధు యాష్కీగౌడ్ అన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story