Kukatpally: మ్యాన్‌హోల్ సమస్యపై రంగారావు సీరియస్!
Kukatpally: కూకట్‌పల్లి మాధవరం నగర్ కాలనీలో దెబ్బతిన్న సెవరేజ్ మ్యాన్‌హోల్‌ను మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు అధికారులతో కలిసి పరిశీలించారు.
Kukatpally: మ్యాన్‌హోల్ సమస్యపై రంగారావు సీరియస్!
కూకట్పల్లి: శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్‌లోని మాధవరం నగర్ కాలనీ, నాగార్జున స్కూల్ ఎదుట దెబ్బతిన్న సెవరేజ్ మ్యాన్‌హోల్ కారణంగా రోడ్డుపై ఏర్పడిన గుంతను మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మేనేజర్ అనిల్‌తో కలిసి శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ... మ్యాన్‌హోల్ దెబ్బతినడంతో మురుగు నీరు రోడ్డు దిగువ భాగాన్ని దెబ్బతీసి గుంత ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్య వాహనదారులు, స్థానిక ప్రజలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రావు, విజయ్ సాగర్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
Next Story




