Madhapur: మాదాపూర్ పరిధిలో విషాదం డివైడర్‌ను ఢీకొన్న బైక్, రైడర్ మృతి!

Madhapur: మాదాపూర్ ఖానామెట్‌లో బైక్ డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో పొలవరపు తేజస్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 10 Sept 2026 1:11 PM IST
Madhapur
X

Madhapur: మాదాపూర్ పరిధిలో విషాదం డివైడర్‌ను ఢీకొన్న బైక్, రైడర్ మృతి!

Madhapur: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానామెట్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిక్షపతినగర్‌లోని 'ఎస్‌ఎస్ ప్రీమియం పీజీ'లో నివాసముంటున్న ఇద్దరు యువకులు రాత్రి సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై మెటల్ చార్మినార్ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యంలో మెటల్ చార్మినార్ సమీపానికి రాగానే బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన బైక్ రైడర్ పొలవరపు తేజస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చున్న దట్టి మోహిత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని తక్షణమే చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ముందుగా కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం పోస్ట్‌మార్టం ప్రక్రియ కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story