Hyderabad: గడువు ముగిసిన పదార్థాలు, రంగులు సీజ్.. ఉప్పల్‌లో కలకలం!
Hyderabad: ఉప్పల్ భారత్‌నగర్ కాలనీలోని ఎస్‌ఎల్‌వీ బేకరీపై ఎం-ఫాస్ట్, ఎస్‌ఓటీ బృందాలు దాడి చేశాయి.
Hyderabad: గడువు ముగిసిన పదార్థాలు, రంగులు సీజ్.. ఉప్పల్‌లో కలకలం!
Hyderabad: విశ్వసనీయ సమాచారం మేరకు ఆహార కల్తీ, ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలపై ఎం-ఫాస్ట్, ఎస్‌ఓటీ ఉప్పల్ బృందం బుధవారం భారత్‌నగర్ కాలనీలోని ఎస్‌ఎల్‌వీ బెంగళూరు అయ్యంగార్ బేకరీపై దాడి నిర్వహించింది.
తనిఖీల్లో బేకరీలో గడువు ముగిసిన ఆహార పదార్థాలతో పాటు సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. బేకరీ పరిసరాలను అపరిశుభ్రంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా బేకరీ నిర్వాహకుడు కెంపేగౌడ దేవరాజ్ నవీన్ వద్ద నుంచి పలు రకాల ఆహార పదార్థాలు, ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు, కేక్ ఇంప్రూవర్లను స్వాధీనం చేసుకున్నారు.
వీటిలో బ్లూ స్టార్ సింథటిక్ ఫుడ్ కలర్స్ 3 బాక్సులు (500 గ్రాముల చొప్పున), గడువు ముగిసిన బేకర్స్‌విల్లే కలర్‌మిస్ట్ లిక్విడ్ ఫుడ్ కలర్స్ 5 బాటిళ్లు (500 గ్రాముల చొప్పున), బుష్ స్వీట్ ఆరెంజ్ ఫుడ్ ఫ్లేవర్ బాటిల్, లేబుల్ లేని సింథటిక్ ఫుడ్ కలర్ బాటిళ్లు 7,
గడువు ముగిసిన మరో 3 కలర్‌మిస్ట్ బాటిళ్లు, గడువు ముగిసిన రియల్ ఫ్రూట్ పవర్ గువా 1 లీటర్ బాటిల్, గడువు ముగిసిన పిల్స్‌బరీ కేక్ మిక్స్ సుమారు 1 కిలో, కస్టమ్ ఎన్ క్రంబ్ పౌడర్ 5 కిలోలు, డైమండ్ కేక్ ఇంప్రూవర్ 1 కిలో బాక్స్, క్లాసిక్ ఫుడ్ కలర్ ఫ్లేవర్ 2 బాటిళ్లు, గడువు ముగిసిన గుడ్‌రిచ్ గ్లేజ్ కేక్ ఇంప్రూవర్ 2.5 కిలోల బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




