LB Nagar: ఎల్బీనగర్‌లో మహిళల రణభేరి: ఎమ్మెల్యే వీర్లపల్లి దిష్టిబొమ్మ దహనం!
LB Nagar: అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా ఎల్బీనగర్ చౌరస్తాలో మహిళలు ధర్నా నిర్వహించి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు.
LB Nagar: ఎల్బీనగర్‌లో మహిళల రణభేరి: ఎమ్మెల్యే వీర్లపల్లి దిష్టిబొమ్మ దహనం!
ఎల్బీనగర్: ప్రజా పాలన, ప్రజా పాలన అంటూ ప్రజా వ్యవస్థనే కూని చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారపూరిత ధోరణి నశించాలని డిమాండ్ చేస్తూ నిన్న అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను చూడకుండా జుట్టు పట్టుకొని తోసి వేస్తూ జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ ఎల్బీనగర్ మహిళల ఆధ్వర్యంలో ఎల్బీనగర్ కూడలిలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కేవలం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుని అనుకరించి వారికి కనుసైగలలోని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పై వీర్లపల్లి శంకరయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై గాను ఆధ్వర్యంలో వీర్లపల్లి శంకరయ్య దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎల్బీనగర్ మహిళలు తీవ్రంగా ఖండించారు. “420 హామీలతో ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మహిళలే చాలు” అని ఎల్బీనగర్ మహిళలు మరోసారి నిరూపించారు.
ఎవరి ప్రోద్బలంతో కాకుండా స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, నిన్న మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని, తాము ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడమే కాకుండా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని ఎల్బీనగర్ మహిళలు డిమాండ్ చేశారు. అనంతరం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు మహిళలు ర్యాలీగా వెళ్లి ఏసిపి గారికి మరియు సిఐ గారికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో హస్తినాపురం మాజీ కార్పొరేటర్ పద్మనాయక్,మల్లీశ్వరిరెడ్డి,రంగేశ్వరి నాయుడు,శైలజ,రమాదేవి,విజయ,అంజలి,లత,దేవి,మమత,శిల్పరెడ్డి,వాణి,సూరజ్ ఎస్దాని,కల్పన,లక్ష్మి,పార్వతి,పద్మ తదితరులు పాల్గొన్నారు.




