LB Nagar: ప్రజా పాలన 1000 రోజుల వేడుకలు యూత్ కాంగ్రెస్ బైక్ ర్యాలీ
LB Nagar: ప్రజా పాలన 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఎల్బీనగర్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మందితో భారీ బైక్ ర్యాలీ.
LB Nagar: ప్రజా పాలన 1000 రోజుల వేడుకలు యూత్ కాంగ్రెస్ బైక్ ర్యాలీ
ఎల్బీనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ యువజన విభాగం ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు వెయ్యి మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ప్రధాన రహదారుల మీదుగా సాగిన ర్యాలీతో కాంగ్రెస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.
ఈ సందర్భంగా శివచరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. గడీల పాలనకు చరమగీతం పాడి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, యువతకు ఉద్యోగాల కల్పన వంటి పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. గత పదేళ్ల పాలనకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువగా పనిచేస్తోందని అన్నారు.
వెయ్యి రోజుల ప్రజాపాలనను పురస్కరించుకుని నిర్వహించిన బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని నాయకులు తెలిపారు.




