Hyderabad: ఎల్బీనగర్ కిరాణా షాపులో మద్యం అమ్మకాలు దాడి
Hyderabad: ఎల్బీనగర్‌లో కిరాణా షాపు పేరిట అక్రమ మద్యం విక్రయాలు. దాడి చేసిన ఏసీపీ కృష్ణయ్య బృందం, భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Hyderabad: ఎల్బీనగర్ కిరాణా షాపులో మద్యం అమ్మకాలు దాడి
హైదరాబాద్: ఎల్బీనగర్ లోని ఎన్టీఆర్ నగర్ లోని ఓ కిరాణా షాపులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న మద్యం విక్రయాలపై నమ్మకమైన సమాచారంతో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య బృందం ఆకస్మిక దాడి చేసింది.
వైన్స్ షాపుల నుంచి భారీగా మద్యం కొనుగోలు చేసి, కిరాణా షాపుల్లో బెల్ట్ షాపుల తరహాలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 256 బీర్లు, 207 క్వార్టర్లు, 56 (90ml) మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
పర్మిషన్ లేకుండా లిక్కర్ అమ్మితే ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. లిక్కర్ సప్లై చేస్తున్న వైన్స్ షాపులపై కూడా నిఘా పెట్టినట్లు తెలిపారు. నిందితులపై ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story




