LB Nagar: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో చైతన్యపురిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

LB Nagar: ఎల్బీనగర్ చైతన్యపురిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని, డీజేలకు అనుమతి లేదని ఏసీపీ రవీందర్ రెడ్డి హెచ్చరిక.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 14 Sept 2026 9:12 PM IST
LB Nagar
X

LB Nagar: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో చైతన్యపురిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

ఎల్బీనగర్‌: గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావన కల్పించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఎల్బీనగర్‌ ఏసీపీ రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు.

చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు పోలీస్‌ సిబ్బంది ఫ్లాగ్‌ మార్చ్‌లో పాల్గొన్నారు. ప్రధాన రహదారులు, గణేష్‌ మండపాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. గణేష్‌ నవరాత్రులను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. గణేష్‌ మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

డీజేలకు అనుమతి లేదు

గణేష్‌ ఉత్సవాల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఏసీపీ పునరుద్ఘాటించారు. నిబంధనలను ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, గణేష్‌ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR