LB Nagar: బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు నిందితుడికి 20 ఏళ్ల జైలు!
LB Nagar: ఎల్బీనగర్‌లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి పోక్సో కోర్టు 20 ఏళ్ల శిక్ష, జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
LB Nagar: బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు నిందితుడికి 20 ఏళ్ల జైలు!
LB Nagar: ఎల్బీనగర్ ..జూలై 24...: ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను గదిలో బంధించి బెదిరించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.13 వేల జరిమానా కూడా విధిస్తూ, బాధితురాలికి రూ.4 లక్షల నష్టపరిహారం మంజూరు చేసింది. ఆ మొత్తాన్ని వెంటనే బాధితురాలికి అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. సూర్యాపేట సమీపంలోని కుప్పిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కనుకు మహేశ్ (25) 2022 సెప్టెంబరులో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో తన సోదరి ఇంట్లో ఉంటున్న సమయంలో 13 ఏళ్ల బాలికను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి, అరిస్తే చంపేస్తానని బెదిరించి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట సెక్షన్-164 ప్రకారం వాంగ్మూలం నమోదు చేశారు. అప్పటి ఎల్బీనగర్ ఇన్‌స్పెక్టర్ బి. అంజిరెడ్డి సమగ్ర ఆధారాలతో అభియోగపత్రం దాఖలు చేయగా, విచారణ అనంతరం నిందితుడిని దోషిగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు జడ్జి ఎం.కే. పద్మావతి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.




